Anu vs Unicode – తేడా ఏమిటి?
Unicode అంటే?
Unicode అనేది ప్రపంచం మొత్తం వాడే ప్రామాణిక encoding. Mobile, WhatsApp, Facebook, Google, Word లో మీరు type చేసే తెలుగు అంతా Unicode లోనే ఉంటుంది. Gautami, Nirmala UI, Ramabhadra, Noto Sans Telugu లాంటివి Unicode fonts. ఒక్కో అక్షరానికి ఒక నిర్దిష్టమైన code ఉంటుంది, ఒత్తులు, గుణింతాలను font స్వయంగా కలిపి చూపిస్తుంది.
Anu fonts అంటే?
Unicode రాకముందు DTP కోసం తయారైన పాత పద్ధతి ఇది. Pragathi, Brahma, Kranthi, Pallavi లాంటి Anu fonts లో ఒక్కో ఆకారం (అక్షరం భాగం, ఒత్తు, దీర్ఘం) English keyboard లోని ఒక code మీద ఉంటుంది. అందుకే Anu text ని సాధారణ font లో చూస్తే \T>T లాంటి English గుర్తులుగా కనిపిస్తుంది.
Designers ఇంకా Anu ఎందుకు వాడతారు?
- పాత Photoshop versions (CS, CS6) లో, కొన్ని settings లో Unicode తెలుగు సరిగ్గా కలవదు – ఒత్తులు విడిపోతాయి.
- Flex, banner, invitation designs కోసం Anu లో వందల అందమైన display fonts ఉన్నాయి.
- పాత PSD, CDR files అన్నీ Anu లోనే ఉంటాయి.
ఎప్పుడు ఏది వాడాలి?
| పని | ఏది |
|---|---|
| Photoshop / CorelDRAW లో Anu font తో design | Unicode → Anu (అక్షరం లో convert చేసి paste) |
| పాత PSD లోని matter ని WhatsApp / Word / Facebook లో వాడడం | Anu → Unicode |
| Website, mobile, social media | ఎప్పుడూ Unicode |
అక్షరం ఎలా మారుస్తుంది?
Box లో Unicode తెలుగు పెడితే Anu కి, Anu text పెడితే Unicode కి – దానంతట అదే గుర్తించి మారుస్తుంది. లక్ష్మి లాంటి రెండు ఒత్తుల పదాలు, ఈ, ఊ లాంటి దీర్ఘాలు అన్నీ Anu typists వాడే అదే codes తో వస్తాయి.
అక్షరం Aksharam